ప్రభాస్‌ ఎవడో నాకు తెలీదు: షర్మిల

November 22, 2024


img

జగన్‌ బాణం గురి తప్పిన్నట్లే ఒక్కోసారి షర్మిల బాణం కూడా గురి తప్పుతోందేమో అనే అనుమానం కలుగుతుంది. 

తెలంగాణలో మంత్రి కొండా సురేఖ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటీఆర్‌పై విమర్శలు చేయబోయి అక్కినేని నాగార్జున, సమంతల ప్రస్తావన చేసి ఒకేసారి వందల కోట్ల పరువు నష్టం దావాలు రెండు ఎదుర్కొంటున్నారు. 

అదేవిదంగా షర్మిల తనకు ప్రభాస్‌తో సంబంధం ఉందని తన సొంత అన్న జగన్మోహన్‌ రెడ్డే తన సైతాన్ సైన్యంతో దుష్ప్రచారం చేయించారని చెప్పుకొని బాధపడుతూ, “ప్రభాస్‌ ఎవడో నాకు తెలీదు. ప్రభాస్‌ని నేను ఇంత వరకు ఎన్నడూ కలవలేదు. ఎన్నడూ చూడలేదు,” అంటూ చెప్పిన రెండు ముక్కలు ప్రభాస్‌ అభిమానులకు ఆగ్రహం కలిగించక మానవు. 

బాహుబలి, కల్కి ఎడి2898 వంటి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా, అంతర్జాతీయ స్థాయి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ని ‘ఎవడో’ అని షర్మిల నోరు జారీ ఉండవచ్చు లేదా డబ్బు, సంపదల వచ్చిన అహంకారం కావచ్చు.

అయితే ప్రభాస్‌తో సంబందం ఉందంటూ పుకార్లు వచ్చినప్పుడు తాను వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చానని షర్మిల చెప్పుకున్నాక ‘ప్రభాస్‌ ఎవడో నాకు తెలీదు,’ అని చెప్పడమే విచిత్రంగా ఉంది.

అమెరికా కోర్టులో ఆదానీ మీద కేసు నమోదైందనే విషయం, ఆదానీ తన అన్నకు రూ. 1,700 కోట్లు లంచంగా ఇచ్చాడనే విషయం గురించి మాట్లాడిన షర్మిలకి, ప్రభాస్‌ స్థాయి హీరో ఎవరో నాకు తెలీదు అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. 

ఏ ఆడపిల్లకైనా తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు అన్న. అటువంటి అన్న సొంత చెల్లెలికి అక్రమ సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించడం క్షమించరాని నేరమే. ఎదిగిన ఇద్దరు పిల్లల తల్లి, ఇలా మీడియా ముందుకు వచ్చి నా అన్న నాగురించి ఇలా దుష్ప్రచారం చేశాడు. నా పిల్లల మీద ఒట్టేసి చెపుతున్నాను. నాకు ఎవరితో అక్రమ సంబంధం లేదని చెప్పుకోవడం చాలా బాధాకరమే.

కానీ ప్రభాస్‌ పట్ల షర్మిల ఇంత చులకనగా మాట్లాడటం కూడా తప్పే. ఎన్నడూ ఆమె జోలికి వెళ్ళని ప్రభాస్‌ అభిమానులను ఆమె తన మాటలతో రెచ్చగొట్టారనే చెప్పొచ్చు. వారు ఎలా రియాక్ట్ అవుతారో?


Related Post