బీజేపీలో చేరుతావా... జైలుకి వెళతావా?

April 03, 2024


img

ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న అతిశీ మార్లీన మంగళవారం మీడియా ముందుకు వచ్చి సంచలన విషయం బయటపెట్టారు. ఇటీవల బీజేపీ అధిష్టానం తరపున ఓ వ్యక్తి నా వద్దకు వచ్చి తక్షణమే బీజేపీలో చేరి మీ రాజకీయ జీవితం కాపాడుకోవాలని లేకుంటే నెల రోజులలోగా అరెస్టు అవుతావని నన్ను హెచ్చరించి వెళ్లారు.

కనుక త్వరలోనే మా ఇల్లు, కార్యాలయంలో ఈడీ సోదాలు చేసి నన్ను కూడా అరెస్ట్ చేయబోతోంది. ఆ తర్వాత సౌరభ్‌ భరద్వాజ్‌, రాఘవ్‌ చద్ధా, దుర్గేశ్‌ పాఠక్‌లను కూడా ఏదో వంకతో అరెస్ట్ చేయబోతోంది,” అని చెప్పారు.  

తమ పార్టీని విచ్ఛిన్నం చేసి తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ అధిష్టానం కుట్రల గురించి వివరిస్తూ, “అర్వింద్ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌, సత్యేందర్ జైన్‌లను అరెస్ట్ చేసిన తర్వాత మా పార్టీ విచ్ఛిన్నం అవుతుందని, ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ అధిష్టానం భావించింది. 

కానీ ఆ విదంగా జరుగకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వంలో మావంటి వారిని బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ నేను బీజేపీ బెదిరింపులు, ఒత్తిళ్ళకు భయపడేది లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా అమద్మీ పార్టీ, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తాను. బీజేపీ నుంచి దేశాన్ని, ఢిల్లీ ప్రజలను, మా పార్టీ కార్యకర్తలను కాపాడుకొనేందుకు నేను పోరాడుతూనే ఉంటాను, “ అని మంత్రి అతిశీ మార్లీన అన్నారు.


Related Post