తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి పొరుగు రాష్ట్రంలో అధికార వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఉలిక్కిపడ్డారు. కేసీఆర్ ఓడిపోయినందుకు కాదు... సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుండా వెళ్ళి ఓడిపోయినందుకు. దీంతో జగన్మోహన్ రెడ్డి వెంటనే తన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలలో చాలామందిని మార్చేస్తున్నారు. అంటే వారిపట్ల నమ్మకం లేదని జగన్ చెప్తున్నట్లే భావించవచ్చు.
తాజాగా లోక్‌సభ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా సన్నాహక సభలు నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి ఉండేవాళ్ళం అని అనడం ద్వారా ఆయన కూడా బిఆర్ఎస్ ఓటమికి వారే బాధ్యులని నిందిస్తున్నట్లే ఉంది. అయితే బిఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ అహంభావం, నిరంకుశ పోకడలు, కుటుంబ పాలన, అభివృధ్ది పేరుతో అవినీతికి పాల్పడటమే ప్రధాన కారణాలని అందరికీ తెలుసు. కనుక కేటీఆర్ తమ మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిందించడం సరికాదనే చెప్పవచ్చు.