32 యూట్యూబ్‌ ఛానల్స్ పెట్టుకొని ఉంటే బాగుండేది: కేటీఆర్‌

December 31, 2023


img

తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కేసీఆర్‌తో సహా ఆ పార్టీలో అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే “రాజకీయాలలో గెలుపోటములు సహజమే. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని, తప్పులు సరిదిద్దుకొని మరింత బలంగా తిరిగి వస్తాము,” అని హుందాగా ఓటమిని అంగీకరించిన కేటీఆర్‌ అప్పుడే ఆ మాటలు మరిచిపోయిన్నట్లున్నారు. 

ఆయన ఓ ట్వీట్‌ని రీట్వీట్‌ చేశారు. దానిలో ఏముందంటే, ఎన్నికల తర్వాత మాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. వాటిలో “కేసీఆర్‌ 32 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసే బదులు, ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకొనేందుకు 32 యూట్యూబ్‌ చానల్స్ ఏర్పాటు చేసుకొని ఉంటే బాగుండేదేమో?” అనే ట్వీట్‌ సహేతుకంగా అనిపిస్తోంది.  

శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ని గెలిపించుకొనేందుకు బిఆర్ఎస్‌ సోషల్ మీడియా గట్టిగానే కృషి చేసింది. అది ఏవిదంగా రకరకాల వ్యూహాలు అమలుచేసిందో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం కూడా తన వ్యూహాలను అమలు చేసింది. కాంగ్రెస్‌ వ్యూహాలు ఫలించినందునే గెలించింది. బిఆర్ఎస్ వ్యూహాలు ఫలించలేదు కనుకనే ఓడిపోయిందని వేరే చెప్పక్కరలేదు. కనుక మెడికల్ కాలేజీలకు బదులు యూట్యూబ్‌ ఛానల్స్ పెట్టుకొంటే బాగుండేది అని ఓటమికి కారణాలను వెతుక్కోవడం అవసరమా?  



Related Post