ఎప్పుడు ఎన్నికలొచ్చినా పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచకుండా పెట్రోలియం కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అదుపుచేయడమే కాకుండా ధరలు తగ్గించడమో లేదా వాటిపై రాయితీలు ప్రకటించడమో చేస్తుంటుంది.
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకి రూ.6 నుంచి రూ.10వరకు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2022, మే 22వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సజ్ సుంకం తగ్గించడంతో పెట్రోల్ ధర లీటరుకి రూ.8, డీజిల్ ధర రూ.6 చొప్పున తగ్గాయి. త్వరలో మళ్ళీ అదేవిదంగా ఎక్సజ్ సుంకం తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. కనుక పెట్రోల్, డీజిల్ రేట్లు ఆ మేరకు తగ్గే అవకాశం ఉంది.
త్వరలోనే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు రాష్ట్రాల పర్యటనలు ప్రారంభిస్తారు. కనుక అంతకంటే ముందుగానే లేదా వారు పర్యటిస్తున్నప్పుడో ఈ ధరల తగ్గింపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.