యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో ఎన్.గీత శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆమె రాజీనామా చేయగానే దేవాదాయశాఖ కమీషనర్‌గా అనిల్ కుమార్, ఆమె స్థానంలో దేవాదాయ శాఖలోనే రీజినల్ జాయింట్ కమీషనర్‌గా పనిచేస్తున్న రామకృష్ణారావుని ఇన్‌చార్జి ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన వెంటనే బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ ఏర్పడి రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే యాదాద్రి ఈవోగా గీత నియమింపబడ్డారు. ఆమె 2014, డిసెంబర్ 4న ఆలయ ఈవోగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఆమె 2020 , ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఆమెనే ఈవోగా కొనసాగిస్తూ వచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు అంటే సుమారు 9 ఏళ్ళపాటు ఒకే ఆలయంలో ఒకే పదవిలో కొనసాగగలగడం చాలా ఆశ్చర్యకరమే. ఈ తొమ్మిదేళ్ళలో ఆమె తీసుకొన్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. వాటిలో ముఖ్యంగా యాదగిరి గుట్ట పట్టణంలో నివసించే స్థానికులు శనివారం ఒక్కరోజే కొండపై స్వామివారి దర్శనానికి అనుమతించాలనేది కూడా ఒకటి. అలాగే యాదాద్రి కొండపైకి ఆటోరిక్షాలను అనుమతించకూడదనే మరో నిర్ణయం కూడా ఆటో డ్రైవర్లకు, స్థానికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
అదే విదంగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పూర్తికావస్తున్నప్పుడు ఆలయ స్తంభంపై మాజీ సిఎం కేసీఆర్ బొమ్మని చెల్లించడంపై కూడా ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమెపై ఎన్ని పిర్యాదులు, విమర్శలు వస్తున్నప్పటికీ కేసీఆర్ ఆమెనే ఈవోగా కొనసాగిస్తూ వచ్చారు. ఈరోజు ఆమె హటాత్తుగా పదవికి రాజీనామా చేయడంతో బహుశః ప్రభుత్వమే ఆమెను రాజీనామా చేసి గౌరవ ప్రదంగా తప్పుకోమని సూచించి ఉండవచ్చు,