మహాలక్ష్మి ఎఫెక్ట్: సోమవారం 50 లక్షల మంది ప్రయాణం!

December 13, 2023


img

రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టడంతో ఆ ప్రభావం మొన్న చివరి కార్తీక సోమవారం రోజున స్పష్టంగా కనబడింది. ఆ ఒక్క రోజే సుమారు 50 లక్షల మంది టిఎస్‌ఆర్టీసీ బస్సులలో ప్రయాణించారు. అంతకు ముందు రోజు ఆదివారం 49 లక్షల మంది ప్రయాణిస్తే మర్నాటికి ఆ సంఖ్య మరో లక్ష పెరిగింది.

మహాలక్ష్మి పధకంతో రద్దీ బాగా పెరుగుతుందని ముందే ఊహించడంతో టిఎస్‌ఆర్టీసీ అదనంగా అనేక ప్రత్యేక బస్సులను నడిపించింది. డ్రైవర్లు, కండెక్టర్లు, డిపో సిబ్బందికి సెలవులు రద్దు చేసి మరీ బస్సులు నడిపించింది.

మహిళలకు జీరో టికెట్‌ ఇస్తునందున వాటి ఆధారంగా ఈ రెండు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించారో అధికారులు లెక్కలు కడుతున్నారు.

నిజానికి ఇంత మంది ప్రయాణించినప్పుడు టిఎస్‌ఆర్టీసీకి భారీగా ఆదాయం, లాభం రావాలి. కానీ మహాలక్ష్మి పధకం వలన కనీసం డీజిల్, నిర్వహణ ఖర్చులు వచ్చినా చాలని సంతోషించే పరిస్థితి ఏర్పడింది. అదీ రాకపోతే ఆ మేరకు టిఎస్‌ఆర్టీసీకి నష్టం వచ్చిన్నట్లే!

అయితే ఇటువంటి నష్టాలకు ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని చెప్పవచ్చు. మరో నెలరోజుల్లో సంక్రాంతి పండుగకు అందరూ ఊర్లకు బయలుదేరుతారు కదా?


Related Post