తెలంగాణ వెలిగిపోతోంది... విద్యుత్ శాఖ మునిగిపోతోంది!

December 09, 2023


img

మాజీ సిఎం కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్ నేతలందరూ 24 గంటలు విద్యుత్ సరఫరాతో తెలంగాణ రాష్ట్రం ధగాధగా వెలిగిపోతోందంటూ ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెప్పుకొంటూ, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అయిపోతుందని పదేపదే హెచ్చరించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలంగాణ వెలిగిపోతున్న మాట నిజమే కానీ అప్పుల ఊబిలో, తీవ్ర నష్టాలలో కూరుకుపోయున్న రాష్ట్ర విద్యుత్ సంస్థలు మునిగిపోతున్నాయని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులే తేల్చి చెప్పేశారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన విద్యుత్ శాఖపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆ శాఖ, విద్యుత్ సంస్థల ఉన్న్తతాధికారులు తమ సంస్థలు ఏవిదంగా మునిగిపోతున్నాయో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో వివరించి చెప్పారు. ఆ వివరాలు క్లుప్తంగా.... Related Post