తెలంగాణ డిజిపి అంజని కుమార్‌పై కేంద్ర ఎన్నికల కమీషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే ఆయన నిన్న మధ్యాహ్నం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు.
ఇది ఎన్నికల నియామవళిని ఉల్లంఘించడమే అని పిర్యాదులు అందడంతో ఈసీ వెంటనే స్పందిస్తూ, ఆయనను పదవిలో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈసీ ఆదేశం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐపిఎస్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా గుప్తా, రాజీవ్ రతన్, సివి ఆనంద్ పేర్లను సిఫార్సు చేయగా వారిలో రాష్ట్రవ్యాప్తంగా గుప్తాను తెలంగాణ డిజిపిగా ఖరారు చేసింది. ఆయన వెంటనే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన ఏసీబీ డీజీగా పనిచేస్తున్నారు.
డిజిపి అంజని కుమార్‌తో పాటు రేవంత్ రెడ్డిని కలిసిన సిఐడి అదనపు డీజి మహేష్ బాబు భగవత్, శాంతిభద్రతల అధనపు డీజి సంజయ్ కుమార్ జైన్‌లను కూడా సంజాయిషీ కోరుతూ ఈసీ నోటీసులు పంపించింది. తెలంగాణ ఎన్నికల ప్రక్రియ 5వ తేదీతో ముగుస్తుంది. కనుక ఈసీకి ఇటువంటి నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉంటుంది.