జనసేనకు పరాభవం... బీజేపీకి ఊరట

December 03, 2023


img

తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన పార్టీ తొలిసారిగా ఎన్నికలలో పోటీ చేసింది. అది పోటీ చేసిన 8 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు వేలాదిమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకొని ఆయన వెంట పరుగులు తీశారు. వారితో ఆయన ఎన్నికల సభలు కిక్కిరిసిపోయాయి. కానీ వారి అభిమానం ఆయన వరకే తప్ప పార్టీ అభ్యర్ధులకు కాదని నిరూపిస్తున్నట్లు మరోసారి నిరూపించి చూపారు. 

అయితే జనసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీ మాత్రం బాగానే లబ్ధి పొందగలిగింది. 2018 ఎన్నికలలో బీజేపీ 119 స్థానాలకు పోటీ చేయగా రాజాసింగ్ ఒక్కరే ఘోషామహల్ నుంచి గెలిచారు. కానీ ఈసారి ఎన్నికలలో బీజేపీ 5 స్థానాలలో గెలిచి మరో మూడు స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. కనుక పవన్‌ కళ్యాణ్‌ వలన బీజేపీ లాభపడింది కానీ బీజేపీ వలన జనసేనకు వీసమెత్తు లాభం కలగలేదు. తెలంగాణలో ఈ ఓటమి ప్రభావం ఏపీ జనసేనపై కూడా తప్పకుండా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టిడిపితో పొత్తు పెట్టుకొంది కనుక జనసేన ఆశిస్తునన్ని సీట్లు లభించకపోవచ్చు.


Related Post