నాగార్జున సాగర్ డ్యామ్ మీద జరిగిన హడావుడిపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ, “సాగర్ డ్యామ్ మీదకి ఏపీ ప్రభుత్వం పోలీసులను పంపించి వారి సాయంతో నీటిని విడుదల చేసుకోవడం ఖచ్చితంగా దుశ్చర్యే. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఏపీ ప్రభుత్వం దురాలోచనతోనే ఈవిదంగా చేసింది. ఈవిదంగా వ్యవహరిస్తే రాష్ట్రాల మద్య సంబంధాలు దెబ్బ తింటాయి,” అని గ్రహిస్తే మంచిది అని గుత్తా సుఖేందర్ రెడ్డి సున్నితంగా హెచ్చరించారు.
పోలింగ్ రోజున తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకే కేసీఆర్, జగన్ కలిసి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోలీసులతో హైడ్రామా ఆడించారని కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండు రోజులుగా డ్యామ్ మీద ఇంత హడావుడి జరుగుతున్నా, ప్రతిపక్షాలు తమని విమర్శిస్తున్నా బిఆర్ఎస్ నేతలెవరూ స్పందించలేదు. కానీ ఇంకా మౌనంగా ఉంటే, ప్రతిపక్షాల వాదనలు నిజమని ప్రజలు కూడా నమ్మవచ్చు కనుక గుత్తా ఈవిదంగా స్పందించి ఉండవచ్చు.