తెలంగాణ ఎన్నికలలో ఈసారి కాంగ్రెస్, బీజేపీలు రెండూ పూర్తి భిన్నమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాయి. కాంగ్రెస్ నిర్ణయం సరైనది అవడంతో అది ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాబోతుంటే, బీజేపీ అధిష్టానం తప్పుడు నిర్ణయంతో ఓడిపోబోతోంది.
కాంగ్రెస్ అధిష్టానం తన పాత వైఖరికి స్వస్తి పలికి రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించి ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందించింది. అదే... బీజేపీ అధిష్టానం ఎన్నికలకు ముందు బండి సంజయ్‌కి మరింత సహాయసహకారాలు అందించవలసి ఉండగా ఆయనను పదవిలో నుంచి తప్పించేసుకొంది.
రేవంత్ రెడ్డికి అండగా నిలబడినందుకు ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతుంటే, బండి సంజయ్‌ని నమ్మకుండా పరాయి వాళ్ళను, చెప్పుడు మాటలను నమ్మినందుకు బీజేపీ ఓడిపోబోతోంది.
బీజేపీతో లోపాయికారిగా వ్యవహరించినందుకు బిఆర్ఎస్ పార్టీ కూడా భారీ మూల్యం చెల్లించబోతోంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు చాలా అవసరమే కానీ వాటి కోసం పార్టీ విశ్వసనీయతను పణంగా పెడితే నష్టపోతామని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించబోతున్నాయి.