ఎగ్జిట్ పోల్స్‌ని నమ్మలేము... పట్టించుకోవద్దు: కేటీఆర్‌

November 30, 2023


img

ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాబోతోందని పది సర్వే, మీడియా సంస్థలు అంచనా వేశాయి. వాటి అంచనాలపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “గత ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే చెప్పాయి. ఒక్కటి మాత్రమే బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది. చివరికి ఆ ఒక్క సంస్థ చెప్పిందే నిజమైంది. గత ఎన్నికలలో మేము గెలిచి అధికారంలోకి వచ్చిన్నట్లే ఈసారి కూడా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాబోతున్నాము.

డిసెంబర్‌ 3న మా పార్టీ గెలిచినప్పుడు మేము ఓడిపోతామని జోస్యం చెప్పిన సంస్థలన్నీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెపుతాయా? అన్ని పార్టీల కంటే ముందుగా మేము అభ్యర్ధులను ప్రకటించి, ప్రజల మద్యకు వెళ్ళాము. కనుక ప్రజల నాడి ఏవిదంగా ఉందో మాకు బాగా తెలుసు. కనుక ఎగ్జిట్ పోల్స్ చూసి బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది. ఈసారి కనీసం 70 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము.   ఈ రెండు మూడు నెలలుగా పార్టీ కోసం రేయింబవళ్ళు శ్రమించిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. 


Related Post