రైతు బంధుకి ఈసీ బ్రేక్... ఎన్నికల తర్వాతే!

November 27, 2023


img

తెలంగాణలో రైతు బంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ బ్రేక్ వేసింది. పోలింగ్‌కు ముందు రైతు బంధు నిధులు విడుదలకు తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతించడం అంటే బిఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చుతున్నట్లే అవుతుందని తెలంగాణలో ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్పాయి.

వాటి ఫిర్యాదు మేరకు ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రైతుబంధు నిధుల విడుదల నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం నేడు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలోకి విడుదల చేయాలనుకొంది. కానీ కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశం మేరకు నిలిపివేయక తప్పడం లేదు. 

తెలంగాణలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసీని ఒత్తిడి చేసి ఎన్నికలకు ముందు హడావుడిగా రైతుబంధు నిధులు విడుదలకు ప్రయత్నించిందని కాంగ్రెస్‌, బీఎస్పీలు వాదించాయి. ఇప్పటికే బీజేపీకి విజయావకాశాలు లేవని తేలిపోయాయి. దీంతో నాలుగైదు సీట్లు కూడా గెలుచుకోలేని దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. బహుశః అందుకే రైతుబంధు నిధులకు బ్రేక్ వేయించి ఉండవచ్చు.


Related Post