వాహ్ కేటీఆర్‌! ఏం ఐడియా... 29న దీక్షా దివస్!

November 26, 2023


img

తెలంగాణ ఎన్నికల ప్రచారం ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. కనుక ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం చేయకూడదు. కానీ పోలింగ్‌కు ముందు రెండు రోజులు అన్ని పార్టీలకు అత్యంత కీలకమైనవే.

కానీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఓ గొప్ప ఐడియా కనుగొన్నారు. నవంబర్‌ 29వ తేదీన దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు!

తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి కోట్లాడిన కేసీఆర్‌ నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆరోజుని దీక్షా దివస్‌గా జరుపుకొంటున్నామని కేటీఆర్‌ చెప్పారు. కనుక బుధవారం  (ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత) రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ జరుపుకోవాలని, ఆస్పత్రులలో రోగులకు పాలు, పండ్లు పంచిపెట్టాలని, విద్యార్దులకు పెన్నులు, నోటు బుక్కులు పంచిపెట్టి తెలంగాణ కోసం కేసీఆర్‌ చేసిన పోరాటాన్ని అందరికీ గుర్తు చేయాలని పిలుపునిచ్చారు. 

అంటే పోలింగ్‌కు ఒకరోజు ముందు ప్రజలను ప్రభావితం చేసేందుకు చేస్తున్న ప్రయత్నమని అర్దమవుతూనే ఉంది. మరి దీనిపై ప్రతిపక్షాలు, ఈసీ ఏమంటాయో చూడాలి. 


Related Post