బిఆర్ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ హెచ్చరిక!

November 24, 2023


img

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఆయన ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో ఈ సందేశం పెట్టారు. “రాబోయే కొద్ది రోజులలో స్కాంగ్రెస్ పార్టీ అనేక నకిలీ వీడియోలు, తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. కనుక బిఆర్ఎస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లు దాని మాయలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. జై తెలంగాణ,” అని ట్వీట్ చేశారు. 

నాలుగు రోజుల క్రితమే కేటీఆర్‌ సిరిసిల్లాలో బిఆర్ఎస్‌ నేతలతో మాట్లాడుతూ, “ఈసారి మన పార్టీ ఓడిపోతుందని మనమే మాట్లాడుకొంటుంటే పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో గ్రహించండి. కాంగ్రెస్‌ నేతలు చెప్పిన మాటలను పట్టుకొని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా, మిగిలిన ఈ పది రోజులు ప్రతీ ఇంటికీ వెళ్ళి అందరితో మాట్లాడి వారు మనకే ఓట్లు వేసేలా చూడండి. ఎవరైనా అసంతృప్తిగా ఉన్నట్లయితే ఈసారి నేను సిరిసిల్ల వచ్చినప్పుడు వారితో నేనే మాట్లాడుతానని చెప్పండి,” అంటూ పార్టీ శ్రేణులను మందలించారు. కేటీఆర్‌ ఫోన్ సంభాషణ మీడియాకు లీక్ అవడంతో బిఆర్ఎస్‌లో కలవరం మొదలైంది. అది నకిలీ ఆడియో అని అనుకోవడానికి లేకుండా, దానిని ధృవీకరిస్తున్నట్లు కేటీఆర్‌ స్వయంగా ఈ ట్వీట్ చేశారు. కనుక ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్‌ ఎదురీదుతోందని బయటపెట్టుకొన్నట్లయింది.          



Related Post