ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. కనుక రెంటిలో ఏది గెలుస్తుంది? దేనికి ఎన్ని సీట్లు వస్తాయి? ఏది ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది?అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా లోక్ పోల్ సంస్థ తన సర్వే నివేదికను ప్రకటించింది. దాని ప్రకారం ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో అంటే 69-72 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రాబోతోంది. ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి గతంలో కంటే రెండు మూడు సీట్లు ఎక్కువే వస్తాయని సిఎం కేసీఆర్ పదేపదే చెప్పుకొంటున్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీకి కేవలం 36-39 సీట్లు మాత్రమే వస్తాయని లోక్ పోల్ సర్వే తేల్చి చెప్పింది.
ఇక ఎప్పటిలాగే ఈసారి మజ్లీస్ తర్వాత 2-3 సీట్లతో నాలుగో స్థానానికే పరిమితం అవుతుందని చెప్పింది. రెండు మూడు నియోజకవర్గాలలో మజ్లీస్ పార్టీకి పడాల్సిన ఓట్లు కాంగ్రెస్ లేదా బీజేపీకి పడే అవకాశం ఉన్నందున ఈసారి దానికి 5-6 సీట్లు మాత్రమే రావచ్చని లోక్ పోల్ సర్వే తేల్చి చెప్పింది. ఇతరులకు 0-1 సీటు గెలుచుకోవచ్చని పేర్కొంది.
బిఆర్ఎస్ పార్టీకి 38-41%, కాంగ్రెస్ పార్టీకి 43-46%, మజ్లీస్ పార్టీకి 3-4%, బీజేపీకి 7-10%, ఇతరులకు 4-6% ఓట్లు లభించవచ్చని లోక్ పోల్ సర్వే తేల్చి చెప్పింది. కర్ణాటక ఎన్నికలలో లోక్ పోల్ జోస్యం ఫలించినందున తెలంగాణ ఎన్నికలలో కూడా ఫలించవచ్చని భావించవచ్చు.