తెలంగాణలో ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో కూడా ప్రధానంగా బిఆర్ఎస్-బీజేపీల మద్యనే పోటీ జరిగేది. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమయ్యేది. ఇంతకాలం రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఇప్పుడు అత్యంత కీలకమైన శాసనసభ ఎన్నికలలో మూడో స్థానానికి జారుకొంది. ఇందుకు కారణాలు అందరికీ తెలుసు. కనుక ఈసారి బిఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మద్య ప్రధానంగా పోటీ జరుగుతోంది.
అయినా బీజేపీ పట్టువదలని విక్రమార్కుడులాగ ఈ ఎన్నికలలో గెలిచేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. తెలంగాణ బీజేపీని గట్టెక్కించడం కోసం స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరుసపెట్టి రాష్ట్రంలో పర్యటిస్తూ బీజేపీ అభ్యర్ధుల తరపున జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
హేమాహేమీలైన ఇంత మంది వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కనుక అందరూ కలిసి తెలంగాణ బీజేపీని ఈసారి ఎన్నికలలో గెలిపించగలరో లేదో డిసెంబర్ 3న ఫలితాలు వచ్చినప్పుడు తెలుస్తుంది.
తెలంగాణలో బీజేపీ నేతల ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు:
అమిత్ షా: శనివారం గద్వాల, నల్గొండ, వరంగల్
జేపీ నడ్డా: ఆదివారం నారాయణపేట, చేవెళ్ళ, మల్కాజ్‌గిరి
అమిత్ షా: నేడు (సోమవారం) జనగామ, కోరుట్ల, ఉప్పల్లో రోడ్ షో.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ: సోమవారం ఎల్లారెడ్డి, కొల్లాపూర్లో సభలు, రోడ్ షో.
మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్: సోమవారం ముషీరాబాద్‌లో రోడ్ షో.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్: సోమవారం జూబ్లీహిల్స్, మల్కాజ్‌గిరిలో ఎన్నికల సభలు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి: సోమవారం మహేశ్వరంలో ఎన్నికల ప్రచారం.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్: 21న తెలంగాణలో రెండు సభలలో పాల్గొంటారు.
ప్రధాని నరేంద్రమోడీ: 24,25 తేదీలలో హైదరాబాద్ పరిధిలో సభలు, రోడ్ షో.
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ: 25,26 తేదీలలో హుజూరాబాద్, మహేశ్వరంలో ఎన్నికల సభలు.
యూపీ సిఎం యోగీ ఆదిత్యనాధ్: 24,25,26 తేదీలలో తెలంగాణలో ఎన్నికల ప్రచారం.
అస్సాం సిఎం హిమంత్ బిశ్వ శర్మ, గోవా సిఎం ప్రమోద్ సావంత్ తెలంగాణలో పర్యటనలు ఇంకా ఖరారు కావలసి ఉంది.