ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే మిగిలిఉంది. కనుక మూడు ప్రధానపార్టీలు తమ ప్రత్యర్ధులను దెబ్బ తీసి పైచేయి సాధించేందుకు తమ ముందున్న ప్రతీ అవకాశాలను వినియోగించుకొంటున్నాయి. ఒకప్పుడు మా పార్టీకి లేదా ఫలానా పార్టీ అభ్యర్ధికే ఓట్లు వేసి గెలిపించమని అభ్యర్ధిస్తూ పోస్టర్స్ పెట్టేవారు. కానీ ఇప్పుడు తమ రాజకీయ ప్రత్యర్ధులను ఎండగడుతూ పోస్టర్స్ పెడుతున్నారు.
బిఆర్ఎస్, మజ్లీస్ పార్టీలను ఆడించేది ప్రధాని నరేంద్రమోడీయే అని సూచిస్తూ కాంగ్రెస్ పార్టీ హైటెక్ సిటీ వద్ద పెట్టిన తోలుబొమ్మలు ప్రజలను చాలా ఆకట్టుకొంది. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి ఆ అవకాశం వచ్చింది.
నేడు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. కనుక శంషాబాద్ విమానాశ్రయం వద్ద రోడ్లకు ఇరువైపులా పోస్టర్స్ వెలిశాయి. వాటిలో తెలంగాణ అమరవీరుల ఫోటోలు, మద్యలో రాహుల్ గాంధీ ఫోటో ముద్రించి, “తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం,” అని పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాశారు. ఈ పోస్టర్ ప్రజలను కూడా ఆలోచింపజేస్తోంది.