నాంపల్లి అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా నిర్లక్ష్యం కారణమా?

November 14, 2023


img

నాంపల్లి, బాలాజీ ఘాట్ బజార్ వద్ద బాలాజీ రెసిడెన్సీలో సోమవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన 9 మంది రెండు కుటుంబాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

రెండో అంతస్తులో నివశిస్తున్న రిటైర్డ్ డాక్టర్ మహ్మద్ జాకీర్ హుస్సేన్ (66), నిఖత్ సుల్తానా (55), మహ్మద్ అజామ్ (58), రెహ్మానా సుల్తానా (50), హస్బూర్ రెహ్మాన్ (32), ఫైజా సమీన (26) పొగతో ఊపిరాడక చనిపోయారు. మూడో అంతస్తులో మరో కుటుంబానికి చెందిన ఫర్హీన్ (35), ఆమె కుమార్తెలు తరోబా 913), మాన్హా (6) కూడా ఊపిరాడక చనిపోయారు. 

ఈ అగ్ని ప్రమాదంలో విషవాయువులు పీల్చి అపస్మారక స్థితిలో ఉన్న మరో 10 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. వారందరూ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో మహ్మద్ తహ్లా (19) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక సిబ్బంది కనుగొన్నారు. కానీ భవన యజమాని రమేష్ జైస్వాల్, అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి, మరణాలకు అసలు కారణమని చెప్పక తప్పదు.

భవన యజమాని భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో అత్యంత ప్రమాదకరమైన, సినిమా షూటింగ్‌లలో ప్రేలుళ్ళకు వినియోగించే రసాయనాలను భారీగా నిలువచేయడం, నివాస సముదాయంలో వాటిని నిలువచేస్తున్నా అగ్నిమాపక శాఖ అడ్డుకోకపోవడం ఈ ప్రమాదానికి అసలు కారణాలని చెప్పక తప్పదు.

నివాస ప్రాంతాలలో దీపావళి టపాసుల దుకాణాలు ఉంటే అగ్నిప్రమాదాలు జరుగుతాయనే వాటిని కాస్త దూరంగా ఏర్పాటు చేస్తున్నప్పుడు, ప్రేలుళ్ళకు ఉపయోగించే రసాయనాలను నివాస ప్రాంతాలలో నిలువ చేస్తున్నా జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, విద్యుత్ తదితర శాఖలు పట్టించుకోకపోవడాన్ని ఏమనుకోవాలి?


Related Post