కాంగ్రెస్, బిజీపీ తుది జాబితాలు విడుదల

November 10, 2023


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్స్‌ దాఖలుకి గడువు ముగుస్తుంది. బిఆర్ఎస్ పార్టీ చాలా ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే, జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం ఈ రేసులు వెనకబడిపోయాయి. 

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈసారి టికెట్స్ కోసం తీవ్ర ఒత్తిడి ఉండటంతో ముందుగా ప్రకటించిన అభ్యర్ధులను మార్చవలసి వచ్చింది. అందుకే ఆలస్యం అయ్యింది. బీజేపీపైఅటువంటి ఒత్తిడి లేనప్పటికీ బలమైన మిగిలిన రెండు పార్టీల అభ్యర్ధులను బట్టి తమ అభ్యర్ధులను ఎంపిక చేస్తుండటంతో ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు కాంగ్రెస్‌, బీజేపీలు కూడా నిన్న రాత్రి తుది జాబితాలు విడుదల చేశాయి. 

కాంగ్రెస్ పార్టీ 5 మంది అభ్యర్ధులను, బీజేపీ 6మంది అభ్యర్ధులతో గురువారం రాత్రి తుది జాబితాలు విడుదల చేశాయి.      



Related Post