సిఎం కేసీఆర్ ఖమ్మం ఎన్నికల సభలో మాట్లాడుతూ, "పువ్వాడని గెలిపిస్తే ఆయన మిమ్మల్ని పువ్వులలో పెట్టి చూసుకొంటాడు. అదే తుమ్మల తుప్పలను తెచ్చుకొంటే తుమ్మ ముళ్ళు గుచ్చుకొంటాయి మీకు. కనుక పువ్వాడ ఇచ్చే పువ్వులు కావాల్నా లేదా తుమ్మ ముళ్ళు కావాల్నా మీరే నిర్ణయించుకోండి," అని అన్నారు.
పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ఉదయం ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఖమ్మంలో కరటక దమనకులనే రెండు గుంట నక్కలు ఓట్ల వేటకు బయలుదేరాయి. గత ఎన్నికలలో జిల్లాలో 9 మంది బిఆర్ఎస్ అభ్యర్ధుల ఓటమికి కారణమైన ఆ రెండు గుంట నక్కలు ఈసారి ఎన్నికలలో డబ్బు విరజిమ్మి గెలవగలమని చాలా ధీమాగా ఉన్నాయి. ఇలాంటి గుంట నక్కలను నమ్మి మోసపోతే తర్వాత మీరే బాధపడతారు. తెలంగాణ రాష్ట్రం, మన ఖమ్మం జిల్లా అభివృద్ధి కొనసాగుతూనే ఉండాలంటే మళ్ళీ నన్ను, బిఆర్ఎస్ పార్టీనే గెలిపించాలి,” అని అన్నారు.
వారిరువురూ ఎటువంటివారైనప్పటికీ ఇద్దరికీ జిల్లాపై మంచి పట్టుంది. ఎన్నికలలో ఎంతైనా ఖర్చు పెట్టగలిగే శక్తి ఉంది. వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరి చేతులు కలపడంతో ఇంకా శక్తివంతులుగా మారారు. ఈసారి సీపీఎం, బీఎస్పీలు కూడా పోటీ చేస్తున్నాయి. కనుక ఈసారి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఖమ్మంలో గట్టి పోటీ, ఎదురీత తప్పదు.