కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తోందని, కనుక ఇప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకు లబ్ధిదారుల ఖాతాలకు రైతు బంధు నిధులు బదిలీ చేయకుండా నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఓ లేఖ వ్రాసింది.
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ ప్రభుత్వం ఈ పధకాల పేరుతో ఓటర్లకు ప్రభుత్వ సొమ్ము చెల్లిస్తూ ప్రలోభపెట్టి వారందరూ బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసేలా చేస్తోంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఓటర్లను ఏవిదంగా ప్రలోభ పెట్టినా అది నేరమే. కనుక పోలింగ్ ముగిసేవరకు ఈ పధకం పేరుతో లబ్ధిదారులకు నిధులు జమా చేయడాన్ని నిలిపివేయించాలని కోరాము,” అని చెప్పారు.
ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్ధన మేరకు కేంద్ర ఎన్నికల కమీషన్ రైతు బంధు నిధులు జమా చేయడాన్ని నిలిపివేయిస్తే, “ఇప్పుడే రైతుబంధుని వద్దంటున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నికలలో గెలిపిస్తే కొనసాగిస్తుందా?” అంటూ బిఆర్ఎస్ పార్టీ వాదిస్తూ కాంగ్రెస్ పార్టీనే ప్రజల ముందు దోషిగా నిలబెట్టకుండా ఉంటుదా?