తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మీడియాలో రోజుకో సర్వే నివేదిక ప్రత్యక్షమవుతోంది. అయితే అవి నిజమైన సర్వేలేనా లేక రాజకీయ పార్టీలు ఓటర్లు ప్రభావితం చేసేందుకు డబ్బులిచ్చి అలా వ్రాయించుకొంటున్నాయా? అనే అనుమానం కలుగుతుంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పార్టీల, వాటి అభ్యర్ధుల బలాబలాలను, ప్రజాభిప్రాయాన్ని అసలు పరిగణనలోకి తీసుకొంటున్నాయా లేదా?అనే అనుమానం కలుగుతుంది.
వాస్తవ రాజకీయ పరిస్థితులను చూస్తే బిఆర్ఎస్ ఆధిక్యత సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అధిక్యత సాధించలేకపోయినా, కనీస మెజార్టీతో లేదా మజ్లీస్ సాయంతో అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కానీ ఆరు సర్వే సంస్థలు ప్రకటించిన ఓ తాజా సర్వే నివేదిక ప్రకారం ఈసారి ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశాయి. బీజేపీ ఎప్పటిలాగే మూడో స్థానానికే పరిమితం అవుతుందని సూచించాయి. మరి వీటి అంచనాలు ఏమేరకు ఫలిస్తాయో ఫలితాలు వస్తే కానీ తెలీదు.