ప్రొఫెసర్ కోదండరామ్... కాంగ్రెస్‌తో పొత్తులా విలీనామా?

October 20, 2023


img

గత రెండు మూడు నెలలుగా వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసేందుకు ప్రయత్నించి చివరికి ఏవిదంగా భంగపడ్డారో చూశాము. ఆమె తర్వాత ఇప్పుడు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ వంతు వచ్చినట్లుంది. 

ఆయన కాంగ్రెస్ పార్టీతో పొట్టుకోవాలనే ఆలోచనతో కరీంనగర్ వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఉత్తర తెలంగాణలో ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తమకు కేటాయించిన్నట్లయితే కాంగ్రెస్‌తో పొత్తులకు సిద్దమని చెప్పడానికి వెళ్ళారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకోవడం కంటే పార్టీలో తెలంగాణ జనసమితిని విలీనం చేసేసి, కేసీఆర్‌పై పోరాటంలో తమతో కలిసివస్తే బాగుంటుందని రాహుల్ గాంధీ చెప్పారు. పార్టీలో చర్చించుకొని సమాధానం చెపుతానని రాహుల్ గాంధీకి చెప్పి వచ్చేశారు. 

వైఎస్ షర్మిల ఆంద్రాకు చెందినవారు కాగా ప్రొఫెసర్ కోదండరామ్‌ తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న నాయకుడు. పైగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలందరితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. కనుక ప్రొఫెసర్ కోదండరామ్‌ కోరిన్నట్లు మూడు సీట్లు కాకపోయినా, ఒక్క సీటు ఇచ్చినా ఈ ప్రతిపాదనపై ఆయన ఆలోచించవచ్చు. 

ఎందుకంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. కానీ కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. కనుక కాంగ్రెస్‌ టికెట్‌ లభిస్తే కాంగ్రెస్‌లో చేరడం మంచిదే.


Related Post