బీజేపీ అధిష్టానానికి విజయశాంతి కొత్త సూచన చేశారు. అదేమంటే గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తాను కేసీఆర్ మీద పోటీ చేయనిస్తే బాగుంటుందని. శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడం తన ఉద్దేశ్యం కానప్పటికీ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు పోటీకి సిద్దంగా ఉన్నానని విజయశాంతి ట్వీట్ చేశారు.
బిఆర్ఎస్ పార్టీపై పోరాటం చేయడంలో బీజేపీ ఎప్పుడూ వెనక్కు తగ్గదనే పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం బీజేపీ అధిష్టానం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తే బాగుంటుందన్నట్లు ఆమె ట్వీట్ చేశారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా ఎన్నికలలో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్ధులను వెతుక్కొంటోంది కనుక విజయశాంతి సూచనను పాటించి నలుగురు ఎంపీలను బరిలో దించితే మంచిదే. ఈసారి గజ్వేల్ నుంచి కేసీఆర్ మీద తాను పోటీ చేస్తానని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పుడు విజయశాంతి కూడా సిద్దం అంటున్నారు. ఇంతకీ విజయశాంతి ఏమన్నారో ఆమె మాటల్లోనే...