గ్రూప్-2 పరీక్షల వాయిదా... యువతి ఆత్మహత్య

October 14, 2023


img

హైదరాబాద్‌, అశోక్ నగర్‌లో బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 పరీక్షల కోసం కోచింగ్ తీసుకొంటున్న ప్రవళిక (23) అనే యువతి, పరీక్షలు వాయిదా పడటంతో తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యి శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యానుకి ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. 

చుట్టుపక్కల హాస్టల్స్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విధ్యార్ధులు ఈ విషయం తెలుసుకొని అక్కడకు చేరుకొని, పరీక్షలు నిర్వహించడంలో విఫలమైన ‘సిఎం కేసీఆర్‌ డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు.

దీంతో ఆ ప్రాంతంలో అర్దరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అతికష్టం మీద పోలీసులు ఆందోళన చేస్తున్న విధ్యార్ధులను  శాంతింపజేసి ప్రవళిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

అయితే పోలీసులు స్వాధీనం చేసుకొన్న లేఖలో గ్రూప్-2 పరీక్షల ప్రస్తావనే లేదని, కనుక ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి రెడ్డి విజ్ఞప్తి చేశారు. 


Related Post