ఖమ్మం, పాలేరు పంచాయితీ: మీరే తేల్చుకోండి

October 12, 2023


img

తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ పూర్తవలేదు. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేయాలనే దానిపై అందరూ తలలు పట్టుకొంటున్నారు.

ఆ సీట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వర రావుకి కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇద్దరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరూ ఆ రెండు సీట్లు తమకే ఇవ్వాలని పట్టుబడుతుండటంతో ప్రతిష్టంభన ఏర్పడింది.

దీనిపై ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కూడా చేతులెత్తేసింది. ఈ రెండు స్థానాలను వారికే వదిలేసి మీరే చర్చించుకొని నిర్ణయించుకోమని కాంగ్రెస్‌ పార్టీ తేల్చి చెప్పేసింది. వారు కూడా తేల్చుకోలేకపోతే పొంగులేటి లేదా తుమ్మల ఇద్దరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్‌కు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఒకవేళ చేరి ఉంటే ఆమె కూడా పాలేరుతో సహా కొన్ని టికెట్ల కోసం పట్టుబట్టి ఉండేవారే! 


Related Post