కేసీఆర్‌ దోస్త్ కుమారస్వామి బీజేపీతో దోస్తీకి సై!

September 22, 2023


img

సిఎం కేసీఆర్‌ తెరాసను బిఆర్ఎస్ పార్టీగా మార్చేటప్పుడు కర్ణాటకకు చెందిన జెడిఎస్ నేత కుమారస్వామి ఆయన వెన్నంటి తిరిగిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ కూడా కర్ణాటకలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, కుమారస్వామిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెడతానని గొప్పగా చెప్పారు. కానీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ కానీ మంత్రులు, బిఆర్ఎస్ నేతలెవరూ గానీ అటువైపు తొంగిచూడలేదు. 

ఎన్నికలలో కలిసి పోటీ చేయకపోయినా కనీసం ప్రచారానికైనా కేసీఆర్‌ వస్తారని, భారీగా ఆర్ధిక సాయం చేస్తారని చేస్తారని కుమారస్వామి చివరి నిమిషం వరకు ఎంతో ఆశగా ఎదురుచూసారు. కానీ కేసీఆర్‌ హ్యాండ్ ఇవ్వడంతో  ఎన్నికలలో జెడిఎస్ ఓడిపోయింది. అదే విషయం ఆయన పరోక్షంగా చెపుతూ కేసీఆర్‌ని విమర్శించారు.

కేసీఆర్‌ ఏ బీజేపీని ఓడించాలనుకొంటున్నారో, కుమారస్వామి అదే బీజేపీతో జత కట్టేందుకు సిద్దమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు ఎన్డీయేలో చేరేందుకు సిద్దమయ్యారు. దీనికోసం ఆయన  ఢిల్లీ వెళ్ళి నేడు అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం ఎన్డీయేలో చేరుతున్నట్లు ప్రకటించారు. 



Related Post