బాలకృష్ణకు అదే సమస్య షురూ

September 18, 2023


img

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీతో రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటుండటంతో, తన పూర్తి సమయం ఇటు సినిమాలకు, అటు రాజకీయాలకు కేటాయించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయాల కోసం సినిమా షూటింగ్‌లు, సినిమా షూటింగ్‌ల కోసం రాజకీయ యాత్రలు మానుకోవలసి వస్తోంది. ఇప్పుడు ఇదే సమస్య నందమూరి బాలకృష్ణకు కూడా వచ్చింది. 

ఏపీ ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ చేసి జ్యూడీషియల్ జ్యూడిషియల్ రిమాండ్‌ మీద రాజమండ్రి జైలుకి పంపించడంతో, ఆయన కుమారుడు నారా లోకేశ్‌, ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముందుకు వస్తే వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉంది. 

ఈ విషయం మంత్రి రోజా స్వయంగా చెప్పారు. కనుక ఇప్పుడు టిడిపికి ఓ పెద్ద దిక్కు చాలా అవసరం. ఈ కష్టకాలంలో నేను ప్రజల మద్యకు వస్తానని ఇటీవలే బాలకృష్ణ ప్రకటించారు. 

అయితే మరోపక్క చివరి దశలో ఉన్న భగవంత్ కేసరి సినిమాని కూడా పూర్తి చేయవలసి ఉంది. ఆ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కనుక బావ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పటికీ బాలకృష్ణ హైదరాబాద్‌ తిరిగివచ్చేసి ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

దీని తర్వాత మరో సినిమా చేసేందుకు బాలయ్య సిద్దంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో మొదలుపెట్టలేకపోవచ్చు. కనుక భగవంత్ కేసరి పూర్తి చేసి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించక తప్పదు. కనుక కొంతకాలం బాలయ్య సినిమాలకు బ్రేక్ తప్పకపోవచ్చు.


Related Post