ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అప్రూవరుగా మారారు. ఇదే కేసులో ఆయన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి, అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డి కూడా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వారిరువురూ కూడా అప్రూవర్లుగా మారి ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఇది చాలా కీలక పరిణామమనే చెపొచ్చు. రెండు రోజుల క్రితమే ఆమె ఆడిటర్ బుచ్చిబాబుని ఈడీ అధికారులు సుదీర్గంగా ప్రశ్నించారు.
వీరందరూ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసేందుకు ఈడీ రంగం సిద్దం చేస్తున్నట్లనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన్నట్లయితే, దాని వలన ప్రజలలో సానుభూతి ఏర్పడుతుంది. బిఆర్ఎస్ కూడా దీనిని రాజకీయ అస్త్రంగా మలుచుకొని ఎన్నికలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. కనుక కల్వకుంట్ల కవిత విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా ఆచితూచి వ్యవహరించవచ్చు.