మాజీ ఏపీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఈరోజు ఉదయం 5 గంటలకు ఏపీ సీఐడీ పోలీసులు నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద అరెస్ట్ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.241 కోట్లు అవినీతికి పాల్పడారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ ఆయనపై కోర్టులో కేసు వేసింది. ఆ కేసులోనే ఆయనను ఈరోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు ఫంక్షన్ హాల్ వద్దనే వైద్య పరీక్షలు చేయించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబు నాయుడుకి సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చి, ఈ కేసులో సెక్షన్స్ 120 (బి), 166, 167, 418, 420, 465,468,201,109 రెడ్ విత్ 34, 37 కింద కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ఏపీలో టిడిపి, వైసీపీల మద్య భీకర రాజకీయ యుద్ధాలు సాగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.