ఇండియా పేరు భారత్‌గా మార్పు?

September 05, 2023


img

భారతదేశాన్ని ఇంగ్లీషు భాషలో ఇండియాగా పేర్కొంటారు కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, వాటి శాఖలు, వాటి సంస్థలు, కోర్టులు అన్నీ కూడా జీవోలు, నోటిఫికేషన్స్, ఉత్తర ప్రత్యుత్తరాలలో ‘ఇండియా’ అనే పేర్కొంటాయి. అయితే త్వరలో ఢిల్లీలో జరుగబోయే జి20 దేశాల సదస్సులో పాల్గొనవలసిందిగా సభ్యదేశాలను ఆహ్వానిస్తూ రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేరిట పంపిన ఆహ్వానపత్రాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌’ అని ముద్రించింది. 

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బ్రిటిష్ కాలంనాటి చట్టాలను, పేర్లను కొనసాగించడం అవసరమా అని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. పాత చట్టాలను, పేర్లను మార్చవలసిన సమయం వచ్చిందని చెపుతున్నారు. దానిలో భాగంగానే ఇండియా పేరును భారత్‌గా మార్చబోతున్నట్లు సూచిస్తూ ఆహ్వానపత్రాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌’ అని ముద్రించిన్నట్లు చెపుతున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో ఈ మేరకు చట్ట సవరణ చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అయితే కాంగ్రెస్‌, మిత్రపక్షాలు కలిసి తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్నందునే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని కాంగ్రెస్‌ వాదిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఒకవేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఇండియా పేరు మార్చేందుకు ప్రయత్నిస్తే గట్టిగా అడ్డుకొంటామని ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు హెచ్చరిస్తున్నాయి. 


Related Post