తొలి జాబితాలోనే... 115 మంది అభ్యర్ధులు ఖరారు!

August 21, 2023


img

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఎప్పటిలాగే సిఎం కేసీఆర్‌ ముందుగా అభ్యర్ధులను ప్రకటించి శంఖారావం పూరించారు. తొలిజాబితాలో 80-90 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తారనుకొంటే తొలిజాబితాలోనే కేసీఆర్‌ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మొత్తం 119 స్థానాలలో 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఏడు నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి వారి స్థానంలో వేరేవారికి అవకాశం కల్పించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), తాటికొండ రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్‌), అజ్మీరా రేఖా నాయక్ (ఖానాపూర్), బేతి సుభాష్ రెడ్డి (ఉప్పల్), రమేష్ చెన్నమనేని (వేములవాడ), గంపగోవర్ధన్ (కామారెడ్డి), రాథోడ్ బాపూరావు (భోధ్), లావుడ్యా రాములు నాయక్ (వైరా), కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (కోరుట్ల)లను కేసీఆర్‌ పక్కనపెట్టేశారు.

వారి స్థానాలలో కోవా లక్ష్మి (ఆసిఫాబాద్), భూఖ్యా జాన్సన్ రాథోడ్ నాయక్ (ఖానాపూర్), కడియం శ్రీహరి(స్టేషన్‌ఘన్‌పూర్‌), బానోతు మధన్ లాల్ (వైరా), దా.సంజయ్ కుమార్‌ (కోరుట్ల)లకు టికెట్స్ ఖరారు చేశారు.

ఇంకా జనగామ, నాంపల్లి, ఘోషామహల్, నర్సాపూర్ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించలేదు. సిఎం కేసీఆర్‌ ఈసారి కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. వీరు తప్ప మిగిలిన వారందరికీ వారివారి స్థానాలలోనే మళ్ళీ పోటీ చేయబోతున్నారు. 




Related Post