మళ్ళీ లోక్‌సభలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ

August 07, 2023


img

రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో, లోక్‌సభ సచివాలయం ఆయనపై విధించిన అనర్హతను ఎత్తివేసి మళ్ళీ లోక్‌సభ సభ్యుడుగా గుర్తిస్తున్నట్లు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఆయన మళ్ళీ వాయనాడ్ (కేరళ) ఎంపీగా లోక్‌సభలో అడుగు పెట్టారు. 

ఆయనపై అనర్హత ఎత్తివేసి మళ్ళీ ఎంపీగా గుర్తిస్తున్నట్లు నోటిఫికేషన్‌ వెలువడగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నాయి. ఆ పార్టీ బిజెపి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా పార్టీ సీనియర్ నేతలందరూ రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ శ్రేణులు బాజా భజంత్రీలు మోగిస్తూ స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా చిందులు వేస్తూ రాహుల్ గాంధీకి జేజేలు పలికాయి. రాహుల్ గాంధీ ఖర్గేతో కలిసి పార్లమెంటుకి చేరుకోగానే అక్కడ కాంగ్రెస్‌ మిత్రపక్షాల సభ్యులు కూడా ఆయనకు ఎదురేగి ఘనస్వాగతం పలికి లోనికి తోడ్కొని వెళ్ళారు.

ఓ దిగువ కోర్టు తీర్పు పట్టుకొని జాతీయస్థాయి నాయకుడైన రాహుల్ గాంధీపై మోడీ ప్రభుత్వం అనర్హత వేటు వేయడం చాలా తొందరపాటు చర్యే అని స్పష్టమైంది. దీంతో వ్రతం చెదినా ఫలం దక్కన్నట్లయింది కేంద్రానికి.


Related Post