తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సిఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు వరాలు ప్రకటించడం ప్రారంభించారు. వాటిలో భాగంగానే టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, దానిలో ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని నిర్ణయించారు.
టీఎస్‌ఆర్టీసీ కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేసి ఎంతగా ప్రాధేయపడినా కనికరించని కేసీఆర్, ఇప్పుడు వారికి ఈ వరం ప్రకటించడం ఎన్నికల కోసమే అని అర్దమవుతూనే ఉంది. ఇదే విషయం మంత్రి మల్లారెడ్డిని విలేఖరులు ప్రశ్నిస్తూ, “ఇది ఎన్నికల స్టంటే కదా?” అని అడగగా ఆయన “అవును ఎన్నికల స్టంటే” అని నోరు జారారు. మళ్ళీ సర్దుకొని మాదొక రాజకీయపార్టీ కనుక ఇది ఎన్నికల కోసమే చేశామనుకొన్నా దీనివలన ఆర్టీసీ కార్మికులకు ఎంతో మేలు కలుగుతుంది కదా?” అని సమర్ధించుకొన్నారు.