తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా డికె అరుణ, ఏపీకి చెందిన సత్యకుమార్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని దానిలో పేర్కొన్నారు.
అలాగే తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారని తెలిపారు. బిఎల్ సంతోష్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా, శివప్రకాశ్ సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని తెలిపారు.
బండి సంజయ్‌ని ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించడం రాజకీయంగా పెద్ద తప్పిదమే అని ప్రజలు కూడా భావిస్తున్నారు. బండి సంజయ్‌కి పార్టీ జాతీయ కార్యదర్శిగా పదోన్నతి కల్పించిన్నప్పటికీ తెలంగాణలో బిజెపికి జరిగిన నష్టాన్ని బహుశః అది ఎన్నటికీ పూడ్చుకోలేకపోవచ్చు. ఇక
జాతీయస్థాయిలో పార్టీ పదవులు పొందిన డికె అరుణ వంటివారు వాటి వల్ల ఏం ప్రయోజనం పొందుతున్నారో, ఆమె వలన బిజెపి అధిష్టానం ఏం ప్రయోజనం పొందుతోందో తెలీదు కానీ ఆమె ఎల్లప్పుడూ తెలంగాణలోనే ఉంటారు. ఇప్పుడు బండి సంజయ్ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఆయన రాష్ట్రంలోనే ఉంటున్నప్పటికీ పార్టీ కోసం చేయగలిగిందేమీ ఉండకపోవచ్చు.