ప్రతిపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ సంచలన ప్రకటన

July 18, 2023


img

బెంగళూరులో జరుగుతున్న బిజెపియేతర పార్టీల సమావేశంలో వివిద రాష్ట్రాలకు చెందిన 26 పార్టీలు పాల్గొన్నాయి. ఈరోజు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీయే బిజెపి జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ముగ్గురూ పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఖర్గే ఓ సంచలన ప్రకటన చేశారు.

తమ పార్టీ ప్రధాన మంత్రి పదవికోసమో లేదా అధికారం కోసం ఆశపడటం లేదని కేవలం మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని కాపాడేందుకే పోరాడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి పదవి ఆశించడం లేదని విస్పష్టంగా చెప్పారు. 

కాంగ్రెస్‌ మిత్రపక్షాలు అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అవుతారని ఆశించడం సహజమే. అయితే ప్రధాని పదవి తమకు వద్దని కాంగ్రెస్‌ ముందే ప్రకటించడం చాలా సంచలన విషయమే. తద్వారా కూటమిలో మిగిలిన పార్టీలకు కూడా కాంగ్రెస్‌ ఆదర్శంగా నిలిచింది. ఈ కూటమి కలిసికట్టుగా ముందుకు సాగుతూ బిజెపిని ఎదుర్కొని ఓడించాలంటే ఇంతకంటే వేరే దారి లేదు. బిహార్‌, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్‌, మమతా బెనర్జీ ఇద్దరూ ప్రధాని రేసులో ఉన్నారు. కనుక వారిద్దరిలో ఒకరు తప్పుకొని మరొకరిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించగలిగితే వారి కూటమి ఐక్యంగా ఉంటూ సుస్థిర ప్రభుత్వం‌, పాలన అందించగలదని దేశ ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. 

అప్పుడే వారి కూటమి విజయావకాశాలు పెరుగుతాయి. మరి ఈ కూటమిలో మిగిలిన పార్టీలు కూడా ఇటువంటి త్యాగాలు చేస్తాయా? త్వరలోనే చూడవచ్చు. 


Related Post