జీహెచ్‌ఎంసీ కమీషనర్‌గా పనిచేస్తున్న లోకేష్ కుమార్‌ను తెలంగాణ శాసనసభ ఎన్నికల అధనపు ప్రధానాధికారిగా నియమించాలని కేంద్రన్ ఎన్నికల కమీషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. కనుక ఆయనను ఆ విధుల నుంచి రిలీవ్ చేసి, ఆయన స్థానంలో రోనాల్డ్ రోస్‌ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదేవిదంగా ఎక్సైజ్ శాఖ కమీషనర్‌గా చేస్తున్న సర్ఫరాజ్ అహ్మద్‌ను తెలంగాణ శాసనసభ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా నియమించాలని కేంద్రన్ ఎన్నికల కమీషన్ ఆదేశించినందున ఆయనను విధుల నుంచి రిలీవ్ చేసి ఆయన స్థానంలో ముషారఫ్ అలీ ఫరూఖీని నియమిస్తూ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికలకు ముందే కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం ఆర్ధికశాఖ, పురపాలక శాఖతో సహా మరికొన్ని శాఖల కార్యదర్శులను కూడా బదిలీ చేయబోతోంది.