తెలంగాణలో నిద్రావస్థలో ఉన్న బిజెపిని నిద్రలేపి పరుగులు పెట్టించి, బిఆర్ఎస్‌ని ముచ్చెమటలు పట్టించిన ఘనుడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నిత్యం బిజెపి గురించే ఆలోచిస్తూ, మాట్లాడుతూ, యుద్ధం చేసేలా చేసిన ఘనుడు బండి సంజయ్. శాసనసభ ఎన్నికలలో బిజెపిని గెలిపించుకొనేందుకు అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి బండి సంజయ్. ఒకవేళ ఎన్నికలలో గెలిస్తే ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండేవారు కూడా.
ఇక నేడో రేపో ఎన్నికల గంట మొగబోతుంటే, ఇటువంటి కీలక సమయం ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించి కేంద్రమంత్రి వర్గంలోకి లేదా జాతీయ కార్యవర్గంలోకి గానీ తీసుకోవాలని బిజెపి అధిష్టానం నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళతామని చెప్పిన కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డికే తెలంగాణ బిజెపి పగ్గాలు అప్పగించబోతున్నట్లు తాజా సమాచారం.
ఈ మార్పుకి ప్రధాన కారణం... రాష్ట్ర బిజెపి నేతలు ఆయనపై పిర్యాదులు చేయడమేనని తెలుస్తోంది. వారిలో ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి తదితరులున్నట్లు తెలుస్తోంది. వారి ఒత్తిడితోనే బండి సంజయ్‌ని మార్చేందుకు బిజెపి అధిష్టానం సిద్దమైన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ప్రతిగా ఆయన బిజెపి అధిష్టానం ఇస్తున్న ఆఫర్లను ఆయన నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకంటే సామాన్య కార్యకర్తగానే ఉండిపోవాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. బహుశః నాలుగైదు రోజులలోగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.