తలుచుకొంటే సిఎం కాగలను.. కానీ సిఎం అనకండి ఓడిపోతా!

May 24, 2023


img

ఈ మాటలన్నది ఎవరో కాదు... కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నిన్న ఆయన 60వ జన్మదిన వేడుకల సందర్భంగా కృష్ణానదీ జలాలను పూజించేందుకు తన అనుచరులతో కలిసి సుమారు 500 కార్లు వేసుకొని బ్రాహ్మణ వెల్లం రిజర్వాయర్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు అనుచరులు జైకొడుతూ “సిఎం సిఎం..” అంటూ నినాదాలు చేశారు. అప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను తలుచుకొంటే సిఎం కాగలను. కానీ ప్రజల కోసం మంత్రిపదవినే వదిలేసుకొన్నవాడిని... ఇంకా పదవుల కోసం ఆశపడతానా?నాకు ప్రజల కంటే పదవులు, అధికారం ముఖ్యం కావు. ప్రజల కోసం చావడానికైనా నేను సిద్దమే. అయినా మీరు నన్ను సిఎం సిఎం... అంటూ అందరూ కలిసి ఉపఎన్నికలలో మా తమ్ముడుని ఓడించిన్నట్లే నన్ను ఓడిస్తారేమో? అని భయంగా ఉంది,” అంటూ జోక్ చేశారు.

తనకు పదవుల మీద ఆశలేదని చెపుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం ఎంతగా పోరాడారో అందరూ చూశారు. పదవుల మీద ఆశ లేదంటూనే అనుచరుల చేత తానే సిఎం అభ్యర్ధినని ప్రచారం చేయించుకొంటున్నారు కదా? ఇక పార్టీలో సీనియర్ అయినప్పటికీ మునుగోడు ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతిని ఎంత దారుణంగా దెబ్బ తీశారో అందరికీ తెలుసు. అయినా తాను పార్టీ అధ్యక్ష పదవికి, ముఖ్యమంత్రి అభ్యర్ధికి అర్హుడనని భావిస్తుండటమే ఆయనలోని పదవీకాంక్షకు అద్దం పడుతోంది కదా? ఒకవేళ నిజంగా ఆశలేకపోతే ఆయన రేవంత్‌ రెడ్డి లేదా మరొకరిని సిఎం అభ్యర్ధిగా సూచించి మద్దతు పలకగలరా?


Related Post