టిడిపి నేత నారా లోకేష్ యువగళం పేరుతో ఏపీలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు, ఆయన వివిద వర్గాలకు చెందిన మేధావులతో మాట్లాడుతూ, “మన ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు క్యూ కడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చిటికలో తమ రాష్ట్రానికి కావల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు సాధించుకోగలుగుతోంది. కానీ ఏపీకి ఒక్క నయాపైసా పెట్టుబడి రావడం లేదు. ఒక్క పరిశ్రమ రావడం లేదు. పైగా రాష్ట్రంలో ఉన్నవే ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఓ ఆంధ్రా పౌరుడిగా మన రాష్ట్రం పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నాను. పక్క రాష్ట్రాలను చూసి అసూయ పడుతున్నాను.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫాక్స్ కాన్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఏపీలో పెట్టుబడి పెట్టి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. కానీ ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ని చూసి భయపడి ఆ కంపెనీ తెలంగాణకు తరలివెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీ తెలంగాణలో ఓ ప్లాంట్, కర్ణాటకలో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఆ రెండు ప్లాంట్స్ ద్వారా వేలమందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వమే సరిగ్గా ఉండి ఉంటే, నేడు ఆ రెండు ప్లాంట్లు మన ఆంధ్రాలోనే ఏర్పాటయ్యేవి. ఆ వేల ఉద్యోగాలన్నీ మన ఆంధ్రా యువతకే దక్కేవి కదా... అని బాధపడుతున్నాను. కానీ మన బంగారం మంచిది కానప్పుడు పొరుగు రాష్ట్రాలను చూసి అసూయపడటం దేనికని నాకు నేనే సర్ధిచెప్పుకొంటాను,” అని నారా లోకేష్ అన్నారు. నిజమే కదా?
రాజశేఖర్ రెడ్డికి ఎందుకు దండం పెట్టానంటే 👇👇 pic.twitter.com/30DGXvjwIo
— Bhavya🦩 (@unexpected5678) May 19, 2023