దళితబంధుపై ప్రతిపక్షాల ఆరోపణలను కేసీఆర్‌ అంగీకరించినట్లేనా?

April 28, 2023


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న దళితబంధు పధకం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతల జేబులు నింపుకోవడానికే ఉపయోగపడుతున్నాయంటూ ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అయితే సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తదితరులు ఏనాడూ వాటిని పట్టించుకోలేదు. అయితే గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన బిఆర్ఎస్ ప్రతినిధుల సభలో సిఎం కేసీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దళితబంధు పధకాన్ని కొందరు ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారని నాకు సమాచారం అందింది. ఈ పధకం నిధులను ఎవరెవరు జేబులో వేసుకొంటున్నారో నా దగ్గర పక్కా సమాచారం ఉంది. ఇకనైనా ఇటువంటి పనులు మానుకోవాలని హెచ్చరిస్తున్నాను. ఇదే వారికి నేను చేస్తున్న చివరి హెచ్చరిక. ఇకనైనా తీరు మార్చుకోకుంటే వారి తోకలు కత్తిరించేస్తాను,” అంటూ తీవ్రంగా హెచ్చరించారు. 

అంటే దళిత బంధు నిధులను బిఆర్ఎస్ నేతలు స్వాహా చేస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సిఎం కేసీఆర్‌ స్వయంగా అంగీకరించిన్నట్లే భావించవచ్చు. అయితే వారెవరో తనకు తెలుసునని చెప్పినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకుండా హెచ్చరికతో సరిపెట్టడం ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేందుకు ప్రతిపక్షాలు అవకాశం కల్పించిన్నట్లే కదా? 


Related Post