అకాల వర్షాలతో పంట నష్టం... రైతన్నల కంట కన్నీరు

April 27, 2023


img

తెలంగాణ గత 4-5 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ళ వానలతో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కళ్ళాలలో ఎండబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో చేతికి వచ్చిన పంట కోల్పోయామని రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వడగళ్ళ వాన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్క జొన్న, పసుపు, పొద్దు తిరుగుడు పువ్వులు, నువ్వులు, కూరగాయలు తదితర పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే పలువురు రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌ యార్డులకు తీసుకువచ్చి తూకానికి ఎదురుచూస్తున్నప్పుడు కుండపోతగా వర్షాలు కురవడంతో యార్డులలో ఉన్న ధాన్యం, పసుపు వంటివి తడిసిపోవడంతో వాటిని చూసి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 



Related Post