ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ను హుజురాబాద్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. తద్వారా రాబోయే ఎన్నికలలో అక్కడి నుంచే ఆయన శాసనసభకు పోటీ చేయబోతున్నట్లు ఖరారు చేశారు. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను మంత్రివర్గం, పార్టీ నుంచి బషీష్కరించిన తర్వాత జరిగిన ఉపఎన్నికలలో బిఆర్ఎస్‌ని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచే పాడి కౌశిక్ హుజురాబాద్ నుంచి పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. సిఎం కేసీఆర్ తనకు టికెట్‌ని ఖరారు చేయకపోయినా హుజురాబాద్ నియోజకవర్గంపై పట్టు పెంచుకొనేందుకు పాడి కౌశిక్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జమ్మికుంటలో జరిగిన బిఆర్ఎస్ సభకు బారీగా జనసమీకరణ చేసి తన సత్తా చాటుకోవడంతో ఆ వేదికపై నుంచే మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాడి కౌశిక్ హుజురాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారని సంకేతం ఇచ్చారు. ఇప్పుడు సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. కనుక రాబోయే ఎన్నికలలో ఈటల రాజేందర్‌కు ఆయనే ప్రత్యర్ధిగా నిలువబోతున్నారు.
రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఒకవేళ ఈసారి కూడా గెలవలేకపోతే మరో 5 ఏళ్ళ వరకు మళ్ళీ బిజెపికి అవకాశం లభించదు. ఆలోగా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుంది. కనుక రాబోయే ఎన్నికలు బిజెపికి, ముఖ్యంగా ఈటల రాజేందర్‌కి కూడా చాలా కీలకం. హుజురాబాద్ నియోజకవర్గంపై ఈటల రాజేందర్‌కు మంచి పట్టుంది. కనుక రాబాద్‌లో వీరిద్దరి మద్య భీకర పోరు జరగడం ఖాయమే.