మోడీ-అదానీ బందంపై నిలదీస్తునందుకే అనర్హత వేటు

March 25, 2023


img

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ తనపై కేంద్ర ప్రభుత్వం అనర్హత వేటు వేయడంపై ఈరోజు ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడారు. “నేను మోడీ-అదానీ బందం గురించి ప్రశ్నిస్తునందునే  నాపై అనర్హత వేటు వేశారని భావించవచ్చు. ఎవరైనా ఓ తప్పు చేస్తే మొదట నేను ఆ తప్పు చేయలేదని వాదించడం మొదలుపెడతారు. కానీ దొరికిపోతామని గ్రహించినప్పుడు అదిగో అది చూశారా ఇది చూసారా? అంటూ వేరే వాటిపైకి మన దృష్టి మళ్ళించేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్నది అదే.

అదానీ సూట్ కేసు కంపెనీలలోకి రూ.20,000 కోట్లు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయని మేము పార్లమెంటులో గట్టిగా నిలదీస్తున్నాము. మా ప్రశ్నకు జవాబు చెప్పలేక నాపై అనర్హత వేటువేసి, ఈ అదానీ వ్యవహారంపై నుంచి అందరి దృష్టి మళ్ళించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారు.

అయితే మేము అదానీ గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నాము తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని కాదు కదా?మరి కేంద్ర ప్రభుత్వం అదానీని ఎందుకు ఇంతగా వెనకేసుకు వస్తోంది? జవాబు చెప్పాలి. జవాబు చెప్పేవరకు మేము మోడీజీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నాపై అనర్హత వేటు వేసినా, జైలుకి పంపినా నేను అదానీ గురించి ప్రశ్నిస్తూనే ఉంటాను,” అని రాహుల్ గాంధీ అన్నారు. 

దేశంలో పెద్దపెద్ద నేరాలు చేసి జైలుకి వెళ్ళివచ్చినవారు, బెయిలుపై బయటకు వచ్చి ముఖ్యమంత్రులు కాగలుగుతున్నారు. వారిపై ఎటువంటి అనర్హత వేటు పడలేదు కానీ సూరత్ కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించిందనే సాకుతో కేంద్ర ప్రభుత్వం హడావుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. కనుకనే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వం తీరును విమర్శిస్తున్నాయి. 

ఇప్పుడు రాహుల్ గాంధీ చెపుతున్న కారణం కూడా ఆలోచింపదగ్గదే. ఇదీగాక దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి, దాని సాయంతో మరెవరూ బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయకూడదనే దురాలోచన కూడా కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినప్పటికీ సుప్రీంకోర్టులో తప్పక న్యాయం పొందగలరని ఆశిద్దాం. 


Related Post