నా పిటిషన్‌ వెరీ అర్జెంట్‌... ప్లీజ్: కల్వకుంట్ల కవిత

March 17, 2023


img

కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ నిన్న తన ఆరోగ్యం బాగోలేదని చెపుతూ ఈడీ విచారణకు హాజరుకాలేదు. కనుక ఈ నెల 20వ తేదీన హాజరు కావాలని ఈడీ మళ్ళీ ఆమెకు నోటీస్ పంపింది. 

దీంతో ఆమె తరపు న్యాయవాదులు నేడు మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌ని కలిసి, ఇవాళ్ళ శుక్రవారమే ఆ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరబోతున్నారు. 

సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం మహిళలను వారి నివాసంలోనే ప్రశ్నించాల్సి ఉండగా ఈడీ అధికారులు ఈ నిబందనకు విరుద్దంగా కల్వకుంట్ల కవితని తమ కార్యాలయానికి పిలిపించుకొని రాత్రి 8.30 గంటల వరకు ఒక్కరినే ప్రశ్నిస్తున్నారని ఆమె న్యాయవాదులు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కి మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. 

అయితే తొలిసారి పిటిషన్‌ వేసినప్పుడే సుప్రీంకోర్టు దానిని నిశితంగా పరిశీలించి అది అత్యవసరంగా విచారణ చేప్పట్టాలో లేదో చూసి తేదీ నిర్ణయిస్తుంది. ఆవిదంగానే ఆమె పిటిషన్‌ను ఈ నెల 24న విచారణ చేపడతామని సిజేఐ చంద్రచూడ్ చెప్పారు. కనుక ఇవాళ్ళ మళ్ళీ వెళ్ళి అడిగినా ఆయన అదే చెప్పవచ్చు.

ఒకవేళ అదే చెపితే కల్వకుంట్ల కవిత ఈనెల 20న ఈడీ విచారణకు హాజరుకాక తప్పదు లేదా 24న సుప్రీంకోర్టు తీర్పు చెప్పేవరకు ఈడీ విచారణకు హాజరుకాకూడదని ఆమె భావిస్తే ఈడీకి లేఖ వ్రాసి మరోసారి గడువు కోరవచ్చు. కానీ ఈసారి ఈడీ అంగీకరించకపోవచ్చు. కనుక ఇవాళ్ళ సుప్రీంకోర్టు ఏం చెపుతుందో చాలా ఆసక్తికరంగా మారింది.


Related Post