అందుకే నాకు తుపాకీ కావాలని అడుగుతున్నా: బైరి నరేష్‌

February 27, 2023


img

కోట్లాదిమంది హిందువులు ఆరాద్యదైవమైన అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై సోమవారం హన్మకొండ జిల్లా గోపాల్‌పూర్‌లో అయ్యప్ప భక్తులు దాడి చేశారు. అయ్యప్పస్వామి పట్ల అనుచితంగా మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు, ప్రజలని రెచ్చగొట్టేవిదంగా మాట్లాడినందుకు కొడంగల్ కోర్టు అతనిని జైలుకి పంపింది.

45 రోజులు జైల్లో ఉండి ఈరోజు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన అయ్యాడు. అతని అభ్యర్ధన మేరకు పోలీసులు అతనిని తమ వాహనంలో ఇంటి వద్ద దింపేందుకు తీసుకువెళుతుండగా దారిలో అయ్యప్పస్వామి భక్తులు బైక్‌లపై వెంబడించి, అతనిని వాహనంలో నుంచి బయకు లాగి పోలీసుల ఎదుటే చితకబాదారు. పోలీసులు వారి నుంచి బైరి నరేష్‌ని విడిపించి తీసుకువెళ్లారు.

అనంతరం అతను విలేఖరులతో మాట్లాడుతూ, “నాకు కొందరు వ్యక్తుల నుంచి ప్రమాదం ఉంది కనుకనే నేను పోలీసుల రక్షణ కావాలని అడిగాను. కానీ పోలీసుల ఎదుటే దుండగులు నాపై దాడి చేశారు. అందుకే నేను ఆత్మరక్షణ కొరకు తుపాకీ ఇవ్వాలని పోలీస్ శాఖకి దరఖాస్తు చేసుకొన్నాను, “ అని చెప్పారు. 

బైరి నరేష్‌ నాస్తికసమాజం అధ్యక్షుడైనంత మాత్రన్న హిందూ దేవుళ్ళని, హిందువుల మనోభావాలని కించపరిచే అధికారం లేదని గ్రహించిన్నట్లు లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొంటున్న అతను సమాజానికి కట్టుబడి మసులుకోవాలి కానీ నోరుంది కదా అని  ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడితే ఇలాంటి చేదు అనుభవాలే ఎదుర్కోవలసి వస్తుంది. ఆయన తుపాకీ పొందితే ఇంకా తీవ్రమైన సమస్యలో చిక్కుకొంటాడు తప్ప దాంతో తనని తాను కాపాడుకోలేడు. కనుక ఇకనైనా హిందువులకి బేషరతుగా క్షమాపణ చెప్పుకొని మళ్ళీ ఆవిదంగా ఎవరినీ కించపరిచేవిదంగా మాట్లాడకుండా సంయమనం పాటిస్తే మంచిది.


Related Post