రాజకీయాలకు సోనియా గాంధీ గుడ్ బై!

February 25, 2023


img

సుమారు మూడు దశాబ్ధాలకు పైగా దేశ రాజకీయాలని, కాంగ్రెస్ పార్టీని శాశించిన సోనియా గాంధీ రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకోబోతున్నారు. 

క్రవారం నుంచి మూడు రోజులపాటు ఛత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలలో నేడు ఆమె పార్టీ నేతలనీ ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “భారత్‌ జోడో యాత్రతో నా రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. రాహుల్ గాంధీ చేసిన ఈ పాదయాత్ర దేశాన్ని మలుపు తిప్పిన గొప్ప యాత్ర.  దేశ ప్రజలందరూ మత సామరస్యం, సహనం, సమానాత్వాన్ని కోరుకొంటున్నారని ఈ యాత్ర రుజువు చేసింది. ఈ యాత్రని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకి, ప్రముఖులకి, ప్రజలకీ అందరికీ పేరుపేరునా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన అద్భుతమైన విజయాలు నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి.

బిజెపి తన రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రజలలో కులమతాల పేరుతో చిచ్చురగిలిస్తోంది. మైనార్టీలని, బడుగు బలహీన వర్గాల ప్రజలని అణచివేస్తోంది. వారి హక్కులని హరించి వేస్తోంది. మోడీ పాలనలో దేశ ఆర్ధిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. దేశంలో అన్ని వ్యవస్థలని భ్రష్టు పట్టించేస్తున్నారు. కనుక ఇది దేశ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీకి కూడా పరీక్షా సమయం. మనమందరం కలిసికట్టుగా నిలబడి పొరాడి ఈ దేశాన్ని కాపాడుకోవలసి ఉంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

అంటే ఇక నుంచి తాను కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉండబోతున్నానని, ఖర్గే నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని సోనియా గాంధీ చెప్పారని అర్దం అవుతోంది. సోనియా గాంధీ హుందాగా తప్పుకోవడం చాలా అభినందనీయమే. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ నాయకత్వ మార్పుని అంగీకరిస్తుందా? ఖర్గేని తమ నాయకుడిగా కాంగ్రెస్‌ నేతలు అంగీకరిస్తారా? అనే ప్రశ్నకి రాబోయే రోజుల్లో సమాధానం లభిస్తుంది. 


Related Post