ఒకప్పుడు భారత్ చిన్న, మద్య, భారీ పరిశ్రమలతో ఉత్పత్తి కేంద్రంగా ఉండేది. కానీ ఆ తర్వాత భారీగా తక్కువ ధరకే ‘చైనా మాల్’ వచ్చిపడుతుండటంతో దేశంలో చాలా పరిశ్రమలు దెబ్బతిని వాటిలో పనిచేస్తున్న లక్షలాదిమంది, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ సమస్యని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తూ, భారత్‌లో మళ్ళీ పరిశ్రమలని బలోపేతం చేయడానికి ‘మేకిన్ ఇండియా’ పాలసీని ప్రకటించింది.
దీనిప్రకారం విదేశీ కంపెనీలు భారత్‌లో పరిశ్రమలు నెలకొల్పి ఉత్పత్తి చేసుకొంటే రాయితీలు, ప్రోత్సాహం అందిస్తోంది. అయితే ఈ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి ప్రధాన అవరోదం భారత్‌లో అడుగడుగునా కనిపించే అవినీతి, పెట్టుబడిదారులని నిరుత్సాహపరిచే నిబందనలు, ఆంక్షలు, అధికారుల లంచగొండితనం, పరిశ్రమల ఏర్పాటులో సవాలక్ష అడ్డంకులు, వాటన్నిటినీ అధిగమించి పరిశ్రమలు ఏర్పాటు చేసినా అధికారుల వేధింపులు, ఇంకా మౌలిక సదుపాయాల లేమి... వంటి అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుండటంతో పారిశ్రామికవేత్తలు వెనుకంజవేస్తుంటారు.
ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఇవన్నీ బాగా తెలుసు. కనుక కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా పాలసీని ప్రకటించి చేతులు దులుపుకోలేదు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, పెట్టిన తర్వాత ఆ పరిశ్రమలు నిలద్రొక్కుకొనేవరకు సహాయసహకారాలు అందించేందుకు ఏకంగా ఓ పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేసింది.
ఇటీవల ముంబైలో జరిగిన ట్రెజరీ లీడర్షిప్ ఫోరం-2023 సదస్సులో ఇన్వెస్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో దీపక్ బగ్లా ఆ వ్యవస్థ ఏవిద్మ్గా పనిచేస్తోందో కృషి చేస్తున్నారో వివరించారు. ఆయన చెప్పింది విన్న తర్వాత భారత్‌కి ఊరికే పెట్టుబడులు రావడం లేదని, వాటి కోసం తెర వెనక ఎంతోమంది, ఎంతగానో కృషి చేస్తున్నారని అర్దమవుతుంది. వారి కృషి ఫలితంగానే దేశవ్యాప్తంగా కొత్తగా అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఏర్పాటవుతున్నాయని స్పష్టమవుతుంది. స్పూర్తిదాయకమైన ఆయన ప్రసంగం గురించి వివరించడం కంటే స్వయంగా వింటే ఇంకా బాగుంటుంది.